ఒక హాస్య అవధానంలో ఒక పృచ్చకుడు పంది, కోడిపెట్ట, చేప, కప్ప ఈ నాలుగు పదాలు బ్రాహ్మణుని ఇంట పెళ్ళిలో ఉపయోగించి ఒక పద్యాన్ని చెప్పండి అని అవధానికి సమస్యనివ్వడం జరిగింది. దానికి అవధాని ఇలా సమాధానం ఇచ్చాడు.
ఊరంత 'పంది' రేసి నోరూరునట్లుగా
వేడి వేడి ప'కోడిపెట్ట' ఇంపుసొంపగు రుచుల
పాయసము మోజెల్ల 'చేప ' చెప్పలేని
రుచులు మా'కప్ప' గించే.
అంటూ సమస్యను హాస్యభరితంగా పూరించాడు ఆ అవధాని.
ఇక్కడ మూడవ పంక్తిలో మోజెల్ల చేప అంటే కావలసినంత తాగించి అని అర్ధం