డాలర్ మారకపు విలువ రూ.69 దాటింది. రూపాయి విలువ ఇంత కనిష్ఠ స్థాయికి చేరడం ఇప్పుడే. రూపాయి విలువలో మార్పు వల్ల మనకేంటి అనుకుంటున్నారా.. చాలా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేది ఎంత నిజమో.. సగటు జీవులపైనా ప్రభావం చూపుతుందన్నది అంతే నిజం. ఒకప్పుడు ఉల్లి ధర దేశ రాజకీయాల్లో ఎలా మార్పులు తెచ్చిందో, రూపాయి ప్రభావం కూడా అలానే రాజకీయాలను శాసించే అవకాశం లేకపోలేదు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కచ్చితంగా ఉండి తీరుతుంది. డాలర్లలో కొని, దిగుమతి చేసుకునే చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం విలువలు ప్రియం అవుతాయి. భారత పరపతి విధానం మరింత కఠినతరం అవుతుంది. ఎన్నికల ఏడాది కనుక ప్రభుత్వం వ్యయాల విషయంలో వెనకడుగు వేయకపోవచ్చు. ఫలితంగా ఖర్చులకు, ఆదాయానికి పొంతన లేక దేశ కరెంట్ లోటు, ద్రవ్యలోటులు పెరుగుతాయి. ఇక ప్రత్యక్షంగానూ రోజువారీ జీవనంపై రూపాయి ప్రభావం ఉంటుంది. సానుకూల, ప్రతికూల ఫలితాలుంటాయి. ఎంత తీవ్రత అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
69 దాటింది | Ecency
The $200 Billion Ghost Debt: Why Buy Now, Pay Later Isn't Showing Up Anywhere It Should...China is now urging other BRICS nations to stand up against the US and the dollar over Iran...this won't end well...sadcorp ·